గోపాల్ పూర్ లో కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభం : ఎర్రబెల్లి ప్రదీప్ రావు

హసన్ పర్తి, వెలుగు : వరంగల్​అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నందని చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాల్ పూర్ -జవహర్ కాలనీ-కోమటిపల్లి మెయిన్ రోడ్ లో గురువారం  వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ ఏడో శాఖను డీసీవో ఎం.నీరజ, మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాప్టెన్ లక్ష్మీకాంత్ రావు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి హాజరై ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ త్వరలో మహబూబాబాద్, జనగామ, వడ్డేపల్లిలో కొత్త శాఖలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్, కో-ఆపరేటివ్ అధికారి జగన్ మోహన్ రావు, బ్యాంకు వైస్ చైర్మన్ తోట జగన్నాథం, బ్యాంకు ఫౌండర్, డైరెక్టర్ బూర ముత్తిలింగం, బ్యాంకు డైరెక్టర్లు పాల్గొన్నారు.