డ్వాక్రా డబ్బులు స్వాహా : రూ.2.40 లక్షలు సొంతానికి వాడుకున్న బ్యాంకు మిత్ర

  • రూ.2.40 లక్షలు సొంతానికి వాడుకున్న బ్యాంకు మిత్ర 

రామాయంపేట, వెలుగు: ఫ్రాడ్​ చేస్తున్న బ్యాంకు మిత్ర మాకొద్దని రామాయంపేట మండలం దామర చెర్వు గ్రామ డ్వాక్రా మహిళలు తేల్చి చెప్పారు. గ్రామంలో కొన్ని గ్రూపులకు సంబంధించిన డబ్బులు బ్యాంకులో జమచేసే విషయంలో అవకతవకలు జరగడంతో ఐకేపీ, బ్యాంకు అధికారులతో కలిసి మహిళలు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. 

అక్కడ 30 గ్రూపుల వరకు ఉండగా 14 గ్రూపులకు సంబంధించిన డబ్బులు జమచేయడంలో తేడాలు వచ్చినట్లు అధికారులు తేల్చారు. అక్కడి బ్యాంకు కరస్పాండెంట్ సుమలత తన అవసరాలకు రూ.2.40 లక్షల వరకు వాడుకున్నట్లు అధికారులు తేల్చారు. దీంతో ఆ డబ్బులను ఆమె నుంచి రికవరీ చేసి విధుల నుంచి తొలగించాలని మహిళ సంఘాల వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ  జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.