అలర్ట్ : మార్చిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

అలర్ట్ : మార్చిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

దేశ వ్యాప్తంగా బ్యాంక్ వినియోగదారులకు ఇది అలెర్ట్ న్యూస్ అనే చెప్పాలి.. ఒకటి కాదు రెండు కాదు మార్చి నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. దేశంలోని అన్ని బ్యాంకులు గెజిటెడ్ సెలవులను అనుసరిస్తాయి. ప్రభుత్వ సెలవు దినాలలో అన్ని బ్యాంకులు మూసివేయబడినప్పటికీ, కొన్ని బ్యాంకులు ప్రాంతీయ పండుగలు మరియు సెలవులను పాటిస్తాయి.  

2024 మార్చి నెలలో మహాశివరాత్రి, హోలీ వంటి అనేక పండుగలు ఉన్నాయి. ఇలా వాటన్నిటికి సెలవులు ప్రకటించగా బ్యాంక్ వర్కింగ్ డేస్ 17 రోజులు మాత్రమే ఉంది. ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవులు అనేది పరిశీలిస్తే 

జాతీయ సెలవుదినాలు:

మార్చి 1: చాప్చార్ కుట్ (మిజోరం)

మార్చి 8: మహాశివరాత్రి (త్రిపుర, మిజోరం, తమిళనాడు, సిక్కిం, అస్సాం, మణిపూర్, ఇటానగర్, రాజస్థాన్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ, గోవా, బీహార్, మేఘాలయ మినహా)

మార్చి 25: హోలీ (కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా)

మార్చి 29: గుడ్ ఫ్రైడే (త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా)

మార్చి 22: బీహార్ దివస్ (బీహార్)

మార్చి 26: యయోసాంగ్ రెండవ రోజు/హోలీ (ఒడిశా, మణిపూర్, బీహార్)

మార్చి 27: హోలీ (బీహార్)

రెగ్యులర్ బ్యాంక్ సెలవులు:

ప్రతి రెండవ శనివారం (మార్చి 9)

ప్రతి నాల్గవ శనివారం (మార్చి 23)

ఆదివారాలు: మార్చి 3, 10, 17, 24, 31

ఈ మూసివేతలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.