ఆగస్ట్ నెలలో బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఆగస్ట్ నెలలో 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతీ నెలలో రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా.. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాంటి పండుగలకు మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు మాత్రమే జరుపుకునే పండగలు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్ట్ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ కొన్ని సెలవులు కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే వర్తిస్తాయి. ఆగస్ట్ నెలలో బ్యాంకు సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూసుకుని అందుకు తగ్గట్టుగా బ్యాంకుకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవడం బెటర్. ఆగస్ట్ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆగస్ట్ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు
* ఆగస్ట్ 3 (శనివారం): కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 4 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 8 (సోమవారం): టెండాంగ్ ల్హో రమ్ ఫాత్ పండుగ సందర్భంగా గ్యాంగ్టక్లో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 10 (శనివారం): నెలలో రెండో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 11 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 13 (మంగళవారం): ఇంఫాల్లో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 15 (గురువారం): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 18 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 19 (సోమవారం): రక్షా బంధన్ సందర్భంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 20 (మంగళవారం): శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కేరళలోని కొచ్చిలో బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 24 (శనివారం): నెలలో నాలుగో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 25 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* ఆగస్ట్ 26 (సోమవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు