Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..

Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..

బ్యాంకుల్లో మీకు పని ఉందా?.. లావాదేవీలు, ఇతర పనులకోసం బ్యాంకుకు వెళ్తున్నారా.. అయితే మీకోసం ఈ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 కోసం బ్యాంక్ సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పండుగలు, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలతో కలుపుకొని మొత్తం నవంబర్ నెలలో మొత్తం12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ పండుగలు, ఈవెంట్‌లు వాటి స్థానాన్ని బట్టి రాష్ట్రాల్లో సెలవులు మారుతూ  ఉంటాయి. ఈ సెలవుల్లో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. కాబట్టి బ్యాంకుకు వెళ్లాలనుకునేవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. 

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు

నవంబర్1(శుక్రవారం): దీపావళి, కుత్ , కన్నడ రాజ్యోత్సవాల కారణంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం , మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 2 (శనివారం): దీపావళి, లక్ష్మీ పూజ ,గోవర్ధన్ పూజ సందర్బంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి. 

నవంబర్ 3 (ఆదివారం): అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) బ్యాంకులు ఆదివారం మూసివేయబడతాయి
నవంబర్ 7 (గురువారం): ఛత్ (సాయంత్రం అర్ఘ్య) సందర్భంగా బెంగాల్, బీహార్ ,జార్ఖండ్‌తో సహా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి .
నవంబర్ 8 (శుక్రవారం): ఛత్ (ఉదయం అర్ఘ్య)/వంగల పండుగ సందర్భంగా బీహార్, జార్ఖండ్ , మేఘాలయ వంటి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
నవంబర్ 9 (శనివారం): రెండవ శనివారం
నవంబర్ 10 (ఆదివారం): ఆదివారం
నవంబర్ 15 (శుక్రవారం): గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ సందర్భంగా మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్-తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ వంటి కొన్ని చోట్ల బ్యాంకులు మూసివేయబడతాయి. రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్.
నవంబర్ 17 (ఆదివారం): ఆదివారం
నవంబర్ 18 (సోమవారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
నవంబర్ 23 (శనివారం): మేఘాలయలో, సెంగ్ కుత్స్నెమ్ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే నవంబర్ 23 నాలుగో శనివారం.
నవంబర్ 24 (ఆదివారం): ఆదివారం