బ్యాంక్ సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయిస్తుంటుంది. ఇది అన్ని చోట్లా ఒకేలా ఉండవు. కొన్ని జాతీయ సెలవుల రోజు అన్ని బ్యాంకులకు సెలవు ఉండగా.. స్థానిక పండగల్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటీస్ ప్రకారం.. వారాంతాలు, ప్రాంతీయ సెలవులతో సహా 2024, మార్చిలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. . వీటిల్లో ప్రాంతీయ సెలవులు సహా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.
- మార్చి 1న చాప్చార్ కుత్ కారణంగా మిజోరంలోని ఐజ్వాల్ నగరంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 3 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 8న మహాశివరాత్రి కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 9 రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
- మార్చి 10 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 17 ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 22న బీహార్ డే సందర్భంగా బీహార్ అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 23 నాలుగో శనివారం కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
- మార్చి 24 ఆదివారం అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
- మార్చి 25న, హోలీ సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
- మార్చి 26న యయోసాంగ్ భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలోని బ్యాంకులకు సెలవు.
- మార్చి 27న హోలీ సందర్భంగా బీహార్‌లోని అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- మార్చి 31 ఆదివారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.