Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం.. దరఖాస్తు చేసుకోండి

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం.. దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) 1,000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ బ్యాంకింగ్ కోసం జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I (JMGS I) కింద ఈ భర్తీ చేపట్టనున్నారు. ఏదేని విభాగంలో డిగ్రీ అర్హత. ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్(centralbankofindia.co.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 1,000

  • జనరల్: 405 పోస్టులు
  • OBC: 270 పోస్టులు
  • ఎస్సీ: 150 పోస్టులు
  • ఎస్టీ: 75 పోస్టులు
  • EWS: 100 పోస్టులు

విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని విభాగంలో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. దాంతో, పాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు.. SC/ ST/ OBC/ PwBD అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు రూ.150.. ఇతర అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఎంపిక ప్రక్రియ:

  • వ్రాత పరీక్ష
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఎంపికైన అభ్యర్థులు బ్యాంకులో పూర్తి స్థాయి ఉద్యోగులుగా చేరడానికి ముందు బ్యాంకింగ్ & ఫైనాన్స్ (PGDBF)లో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేయాలి.

జీతం: ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 48,480 నుండి రూ. 85,920 వరకు జీతం అందుకుంటారు.

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 30, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2025

నోటిఫికేషన్ కోసం Central Bank of India Recruitment 2025 ఇక్కడ క్లిక్ చేయండి.