నిరుద్యోగులకు శుభవార్త: బీసీ స్టడీ సర్కిల్ లో బ్యాంక్ జాబ్స్ కు ఫ్రీ ట్రైనింగ్

నిరుద్యోగులకు శుభవార్త: బీసీ స్టడీ సర్కిల్ లో బ్యాంక్ జాబ్స్ కు ఫ్రీ ట్రైనింగ్
  • ఏప్రిల్ 12న స్ర్కీనింగ్ టెస్ట్

హైదరాబాద్, వెలుగు: బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్, బీసీ స్టడీ సర్కిల్ కలిసి సంయుక్తంగా నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాయని చెప్పారు. 

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్​లో నెల రోజులు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​లో శిక్షణ  ఇస్తామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయ్యాక ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివరించారు. అభ్యర్థులు మార్చి15 నుంచి ఏప్రిల్ 8 వరకు www.tgstudycircle.cgg.gov.i  n వెబ్​సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.