నల్గొండ జిల్లా: ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళలను లైంగికంగా వేధిస్తున్న మిర్యాలగూడ గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్‌ను షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. తన కోరిక తీరిస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపి ఓ మహిళను వేధించగా .. ఆమె తన బంధువులకు, షీ టీమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారి సలహా మేరకు బాధితురాలు తనకు ఇష్టమున్నట్టుగా మాట్లాడి మేనేజర్ వెంకటేశ్వర్లును కలిసేందుకు ఒప్పుకుంది.
గురువారం తనతో మాట్లాడేందుకు వచ్చిన మేనేజర్‌ను బంధువులతో కలిసి దాడి చేసి పోలీసులకు పట్టించింది. గత కొంతకాలంగా కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారని షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మేనేజర్ వెంకటేశ్వర్లును షీ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.