
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంఎస్‌ఎంఈ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన 250 సీనియర్ మేనేజర్స్ ఖాళీల నియామకానికి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 28 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 26 వరకు రూ.600(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.100) అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bankofbaroda.in వెబ్సైట్లో సంప్రదించాలి.