
బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో రిలేషనల్‌షిప్ మేనేజర్స్, క్రెడిట్ అనలిస్టుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 325 పోస్టుల్లో రిలేషనల్‌షిప్ మేనేజర్లు–175, క్రెడిట్ అనలిస్టు పోస్టులు 150 ఉన్నాయి.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్స్ విభాగంలో పీజీ డిగ్రీ/ సీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. పోస్టును బట్టి 28 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను
సెలెక్షన్ చేస్తారు.ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు ఉంటుంది. దీనిలో రీజనింగ్,
ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ www.bankofbaroda.in సంప్రదించాలి.