నిరుద్యోగులకు గుడ్న్యూస్..బ్యాంక్ ఆఫ్ బరోడాలో 627 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్న్యూస్..బ్యాంక్ ఆఫ్ బరోడాలో 627 ఉద్యోగాలు

బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కార్పొరేట్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 627 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 2. 

పోస్టులు: బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఆయా విభాగాల్లో మొత్తం 627 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన 168, కాంట్రాక్టు ప్రాతిపదికన 459 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అర్హత: 

ఈ  బ్యాంక్ బరోడా రిక్రూట్ మెంట్ 2024 కోసం అప్లయ్ చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా నోటిఫికేషన్ లోఇవ్వబడిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. 

ఏజ్ లిమిట్ :

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం కోసం అప్లయ్ చేసుకోవాలంటే అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలుండాలి. గరిష్టంగా 45 సంవత్సరాలు. ఒక్కో పోస్టుకు వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, OBC, EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600 + ట్యాక్స్ 
  • SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు: రూ. 100 +ట్యాక్స్