ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో ఏపీలో 9 చోట్ల, తెలంగాణలో 7 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 592
విభాగాల వారీగా ఖాళీలు:
- ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 140
- డిజిటల్ గ్రూప్: 139
- రిసీవబుల్ మేనెజ్మెంట్: 202
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 31
- కార్పొరేట్, క్రెడిట్ విభాగం: 79
- ఫైనాన్స్: 1
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి: పోస్టులను బట్టి వయోపరిమితి ఉంది. అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 22 నుంచి గరిష్టంగా 45 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 600 రూపాయలు.. ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ,మహిళా అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు రుసముగా చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 30/ 10/ 2024
- దరఖాస్తులకు చివరి తేదీ: 19/ 11 /2024
పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవగలరు. నోటిఫికేషన్ కోసం Bank of Baroda Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయండి.