
న్యూఢిల్లీ:బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వివిధ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిటైల్, ఎంఎస్‌ఎంఈ విభాగాలకు చెందిన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లోన్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను మాత్రం మార్చలేదు.
ఆటో, పర్సనల్ లోన్లు వంటి చాలా వినియోగదారుల లోన్లపై వడ్డీని నిర్ణయించడానికి ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్‌ను వాడుతున్నారు. దీనిని 9 శాతం దగ్గర బీఓబీ కొనసాగిస్తోంది.