జస్ట్ ఇంటర్వ్యూ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

జస్ట్  ఇంటర్వ్యూ తో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్​ పోస్టుల భర్తీకి బ్యాంక్​ ఆఫ్​ బరోడా నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 11 లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. 

పోస్టులు 518: సీనియర్​ మేనేజర్, మేనేజర్​డెవలపర్​ ఫుల్​స్టాక్, ఆఫీస్​ డెవలపర్, సీనియర్​ మేనేజర్, ఆఫీస్​ క్లౌడ్​ ఇంజినీర్, ఆఫీసర్​ఏఐ ఇంజినీర్, మేనేజర్​ ఏఐ ఇంజినీర్, సీనియర్​ మేనేజర్​ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్​ ఏపీఐ డెవలపర్, మేనేజర్​ ఏపీఐ డెవలపర్, మేనేజర్​ నెట్​వర్క్​అడ్మినిస్ట్రేటర్, సీనియర్​ మేనేజర్​ డేటాబేస్ ​అడ్మినిస్ట్రేటర్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్​ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా.