హైదరాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకో ప్రముఖ లీడింగ్ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి విరాళం అందించింది. గురువారం ( అక్టోబర్ 24) బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన చెక్ ను అందజేశారు. వరద బాధితులకోసం ఇప్పటికే సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.