హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల ‘స్టార్ ధన్ వృద్ధి’ పేరుతో ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించింది. సూపర్ సీనియర్ సిటిజన్లకు డిపాజిట్ల మీద ఏడాదికి 7.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, ఇతరులకు 7.25 శాతం వడ్డీరేటు ఇస్తామని బ్యాంక్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై లోన్లు, ముందస్తు విత్ డ్రా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆఫర్లు పొందాలనుకునే కస్టమర్లు ఏదైనా బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) బ్రాంచ్ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ నెల 1 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చిందని, కొంతకాలం వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు.