ఒకేరోజు 111 బీఓఐ బ్రాంచులు ఓపెన్‌‌

ఒకేరోజు 111 బీఓఐ బ్రాంచులు ఓపెన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)  దేశం మొత్తం మీద 111 బ్రాంచులను సోమవారం ఓపెన్ చేసింది. బ్యాంక్ ఎండీ రజనీష్ కర్నాటక్ వీటిని ప్రారంభించారు. వీటితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  211 కొత్త బ్రాంచులను బీఓఐ  ఓపెన్ చేసింది. మొత్తం బ్రాంచుల సంఖ్య 5,301 కి చేరుకుంది.  బ్యాంక్‌‌ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది.  తాజాగా ప్రారంభించిన బ్రాంచుల్లో 11  తెలంగాణలో, 6 ఆంధ్ర ప్రదేశ్‌‌లో ఉన్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  తెలంగాణలో 15, ఆంధ్ర ప్రదేశ్‌‌లో 10 బ్రాంచులను బీఓఐ ఓపెన్ చేసింది.