ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏసీఎల్‌‌‌‌‌‌‌‌తో బీఓఐ జత

ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏసీఎల్‌‌‌‌‌‌‌‌తో బీఓఐ జత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: బ్యాంక్ కస్టమర్లకు వివిధ  ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అందించేందుకు బీమా కంపెనీ  న్యూ ఇండియా అస్యూరెన్స్ కో. లిమిటెడ్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏసీఎల్‌‌‌‌‌‌‌‌) తో  బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, బీఓఐ ఖాతాదారులు ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏసీఎల్‌‌‌‌‌‌‌‌ అందించే ఆరోగ్య, మోటార్, వ్యక్తిగత ప్రమాద, గృహ, కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీలతో సహా వివిధ పాలసీలను పొందడానికి వీలుంటుంది. ఈ సందర్భంగా బీఓఐ సీఈఓ  రజనీష్ కర్ణాటక్ మాట్లాడుతూ, ‘కస్టమర్లకు ఒకే చోట అన్ని రకాల బీమా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను అందివ్వడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది’ అని అన్నారు.