బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం రూ. 2,517 కోట్లు

 బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం రూ. 2,517 కోట్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కి  కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ.2,517 కోట్ల నికర లాభం వచ్చింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.1,870 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 35 శాతం వృద్ధి  నమోదైంది. 

అదే కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.2,374 కోట్ల ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 6 % పెరిగింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి క్యూ3 లో  రూ.6,070 కోట్లకు చేరుకుంది. 

నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏల విలువ 29 % తగ్గి రూ.7,627 కోట్లకు దిగొచ్చింది. క్యూ3 లో 2.23 లక్షల పీఎం జన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధన్ యోజన అకౌంట్లను ఓపెన్ చేశామని  బీఓఐ ప్రకటించింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– డిసెంబర్ మధ్య 10.49 లక్షల అకౌంట్లను ఓపెన్ చేశామని తెలిపింది. కిందటి నెల 31 నాటికి బీఓఐకు ఇండియాలో 5,202 బ్రాంచులు ఉన్నాయి.