
న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను అమ్మడం ద్వారా రూ.2,690 కోట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) సేకరించింది. వీటి కాల పరిమితి 10 ఏళ్లు కాగా, ఏడాదికి 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఫండ్స్‌ను సేకరించింది.
ఇష్యూ సైజ్ రూ.1,500 కోట్లు. గ్రీన్ షూ ఆప్షన్ కింద రూ.3,500 కోట్ల వరకు సేకరించడానికి బ్యాంక్‌కు వీలుంది. మొత్తం రూ.8,845 కోట్ల విలువైన 94 బిడ్స్‌ను అందుకున్నామని, ఇష్యూ 5.90 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
26 బిడ్స్‌కు బాండ్లను అమ్మింది. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం, ఈ లాంగ్‌టెర్మ్ బాండ్లను అమ్మడం ద్వారా సేకరించిన ఫండ్స్‌ను అఫోర్డబుల్ హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లలో లోన్లను ఇవ్వడానికి వాడనుంది.