![బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 1,458 కోట్లు](https://static.v6velugu.com/uploads/2023/11/bank-of-india_rzxh3ANEbY.jpg)
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023–-24 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో రూ.1,458 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. ఇది క్రితం సంవత్సరం కాలంలో నమోదైన రూ.960 కోట్లతో పోలిస్తే 52 శాతం ఎక్కువ.
ఈ ప్రభుత్వ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రెండో క్వార్టర్లో రూ.5,740 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన రూ.5,083 కోట్లతో పోలిస్తే 13 శాతం మెరుగుపడింది. తాజా క్వార్టర్లో వడ్డీయేతర ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,417 కోట్ల నుంచి రూ.1,688 కోట్లకు చేరింది. రెండవ క్వార్టర్లో బ్యాంక్ నిర్వహణ లాభం రూ.3,756 కోట్లకు చేరింది.