
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఆర్మీ వాళ్లకు రక్షక్ శాలరీ ప్యాకేజీ స్కీమ్ కింద ప్రయోజనాలను అందివ్వడానికి ముందుకొచ్చింది. ఇండియన్ ఆర్మీతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం, ఫ్రీగా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తుంది.
డెబిట్, క్రెడిట్ కార్డులపై బెనిఫిట్స్ ఇస్తుంది. ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్‌లో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ పూరి, బీఓఐ ఎగ్ఙిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రత్ కుమార్ ఎంఓయూపై సంతకాలు చేశారు.