ఎఫ్‌‌‌‌‌‌‌‌డీ రేట్లను పెంచిన బీఓఐ

ఎఫ్‌‌‌‌‌‌‌‌డీ రేట్లను పెంచిన బీఓఐ

హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)  షార్ట్‌‌‌‌‌‌‌‌, మీడియం టెర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్‌‌‌‌డీ) రేట్లను పెంచింది. 180  రోజుల నుంచి ఏడాది  మధ్య కాల పరిమితి  ఉండి, రూ. 3 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలపై  6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉండి, 180 రోజుల నుంచి 210 రోజుల మధ్య గల  ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలకు 6.5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 శాతం వడ్డీని,  211 రోజుల నుంచి ఏడాది లోపు ఉండే ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలకు 6.75 శాతం వడ్డీని ఇస్తోంది.

 వీటితో పాటు రూ.3 కోట్ల లోపు ఉండి, 6 నెలల కంటే ఎక్కువ కాల పరిమితి గల  సూపర్ సీనియర్ సిటిజన్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌డీలకు  అదనంగా 0.65 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్స్‌‌‌‌‌‌‌‌కు 0.50 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ తీసుకొచ్చిన ‘666 రోజులు–ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్‌‌‌‌‌‌‌‌’  స్కీమ్‌‌‌‌‌‌‌‌పై  జనరల్ పబ్లిక్‌‌‌‌‌‌‌‌కు ఏడాదికి 7.30 శాతం వడ్డీని, సూపర్ సీనియర్ సిటిజన్‌‌‌‌‌‌‌‌కు రూ.7.95 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్స్‌‌‌‌‌‌‌‌కు 7.80 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.