
హైదరాబాద్, వెలుగు : బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) తన కస్టమర్లకు పండుగ సీజన్ బహుమతిగా రూ.మూడు కోట్ల కంటే తక్కువ ఉన్న ప్రత్యేక 400 రోజుల రిటైల్ టర్మ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భారీ వడ్డీ పొందవచ్చని తెలిపింది. సూపర్ సీనియర్ సిటిజన్లు 8.10 శాతం, సీనియర్ సిటిజన్ కోసం 7.95శాతం, ఇతర కస్టమర్లకు 7.45శాతం వడ్డీ ఇస్తారు. ఇందులో ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్సదుపాయం ఉంటుంది. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ డిపాజిటర్లూ ఈ స్కీములో ఇన్వెస్ట్ చేయొచ్చు.