ఘట్ కేసర్​లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్​

ఘట్ కేసర్​లో  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  బ్రాంచ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఘట్ కేసర్ లోని శివారెడ్డిగూడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ మేనేజర్ కె.ఈ.హరికృష్ణ, హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ జీఎస్ డి ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 73 శాఖలను కలిగి ఉందన్నారు. ఇండియాలోని 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2,400 కంటే ఎక్కువ శాఖలతో 30 మిలియన్ల మంది కస్టమర్లకు బ్యాంక్ సేవలందిస్తున్నట్లు తెలిపారు.