బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్స్​

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్స్​

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 100  క్రెడిట్ ఆఫీసర్ స్కేల్‌ 2, 3 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.


అర్హత: డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఏ, పీజీడీబీఎం, సీఏ, ఫైనాన్షియల్‌ రిస్క్ మేనేజర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-II పోస్టులకు 25 నుంచి 32 సంవత్సరాలు. క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-III పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. రూ.1180 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118) అప్లికేషన్​ ఫీజు ఆన్​లైన్​లో నవంబర్​ 6 వరకు చెల్లించాలి. పూర్తి వివరాలకు  www.bankofmaharashtra.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.