
మేనేజర్పోస్టుల భర్తీకి పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 20: సీనియర్ మేనేజర్ (బ్యాంక్ ఆఫీస్ ఆపరేషన్స్) 5, చీఫ్ మేనేజర్(ఫారెక్స్/ క్రెడిట్/ ట్రేడ్‌ఫైనాన్స్) 4, చీఫ్ మేనేజర్(కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్మెంట్) 2, సీనియర్ మేనేజర్(బిజినెస్ డెవలప్మెంట్) 2, చీఫ్ మేనేజర్(లీగల్) 1, అసిస్టెంట్జనరల్మేనేజర్(క్రెడిట్) 1, అసిస్టెంట్జనరల్ మేనేజర్(కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్మెంట్) 1, అసిస్టెంట్జనరల్మేనేజర్(ఫారెక్స్ డీలర్) 1, అసిస్టెంట్జనరల్ మేనేజర్(ట్రెజరీ) 1, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐబీయూ) 1, జనరల్ మేనేజర్ (ఐబీయూ)1.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్ఎల్బీ, పీజీ, సీఏ, ఎంబీఏ, పీఈజీడీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి సీనియర్ మేనేజర్కు 25–38 ఏండ్లు, చీఫ్ మేనేజర్కు 40 ఏండ్లు, అసిస్టెంట్జనరల్ మేనేజర్కు 45 ఏండ్లు, డిప్యూటీ జనరల్మేనేజర్కు 50 ఏండ్లు, జనరల్ మేనేజర్కు 55 ఏండ్లు నిండి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్అభ్యర్థులకు 1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118.
లాస్ట్‌డేట్: మార్చి 15.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్కేల్ ఆఫ్ పే:
* స్కేల్-3: రూ.85920 నుంచి రూ.105280
* స్కేల్-4: రూ.102300 to రూ.120940
* స్కేల్-5: రూ.120940 to రూ.135020
* స్కేల్-6: రూ. 140500 to రూ. 156500
* స్కేల్-7: రూ.156500 to రూ.173860
ALSO READ : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫీస్ ఉద్యోగాలు.. బీటెక్, ఎంబీఏ పూర్తయినోళ్లు ట్రై చేయొచ్చు..