- డిపాజిట్స్, కాసా, నెట్ ఎన్పీఏలో ఉత్తమ పనితీరు
హైదరాబాద్ : బ్యాంకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ పీఎస్ యూ బ్యాంకుల్లోనే బిజినెస్, డిపాజిట్ల సమీకరణలో అత్యధిక గ్రోత్ ను సాధించామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) తెలిపింది. పైనాన్షియల్ ఇయర్ 2023–24కు డొమెస్టిక్ బిజినెస్ లో15.94% గ్రోత్ ను నమోదు చేశామని చెప్పింది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ఇదే సమయానికి13.12% వృద్ధిని
నమోదు చేయగా దానిని తాము అధిగమించామని బీఓఎం పేర్కొంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023–-24కు మొత్తం 4,74,411 కోట్ల బిజినెస్ (డిపాజిట్లు, అడ్వాన్స్ లు) చేశామని వివరించింది. డిపాజిట్ల సమీకరణలోనూ15.66% గ్రోత్ ను సాధించి టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్నామని వెల్లడించింది.
కాసా డిపాజిట్లను 52.73%గా నమోదు చేసి అందులోనూ టాప్ గా నిలిచామని తెలిపింది. లోన్ గ్రోత్ 16.30%గా ఉండి సెకండ్ ప్లేస్ ను సొంతం చేసుకున్నామని చెప్పింది. నెట్ ఎన్ పీఏలను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అతి తక్కువగా 0.2%గా నమోదు చేశామని స్పష్టం చేసింది.