
న్యూఢిల్లీ: ఈ నెల 24 (సోమవారం) నుంచి చేపట్టాలనుకున్న రెండు రోజుల సమ్మెను బ్యాంక్ యూనియన్లు వాయిదా వేశాయి. వారానికి ఐదు రోజుల పని, అన్ని కేడర్లలో నియమకాలు పూర్తి చేయడం వంటి డిమాండ్లకు ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన యూనిటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ నెల 24, 25 న సమ్మె చేపట్టాలని గతంలో పిలుపునిచ్చింది.