![మార్చి 24,25తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె](https://static.v6velugu.com/uploads/2025/02/bank-unions-give-2-day-strike-call-beginning-march-24--to-press-for-demands-including-5-day-work-week_wfY97zLHGo.jpg)
వారానికి ఐదు రోజులు పనిదినాలు, బ్యాంకుల్లోఉద్యోగ నియామకాలు వంటి డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మె ప్రకటించారు. దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. మార్చి24 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.
9 బ్యాంక్ ఉద్యోగ సంఘాలకు చెందిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇచ్చిన సమ్మె పిలుపు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్ మెన్ లేదా ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ , ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
చర్చల తర్వాత మార్చి 24 ,25, 2025 తేదీలలో రెండు రోజుల నిరంతర సమ్మెతో ముగిసే ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు UFBU ఒక ప్రకటనలో తెలిపింది.