మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

కోల్‌కతా: తమ ముఖ్యమైన డిమాండ్ల గురించి ఇండియన్​ బ్యాంకర్స్​ అసోసియేషన్​(ఐబీఏ)తో జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈ నెల 24,25 తేదీల్లో సమ్మె చేయనున్నట్టు యునైటెడ్ ​ఫోరం ఆఫ్​ బ్యాంక్ ​యూనియన్స్​(యూఎఫ్​బీయూ) తాజాగా ప్రకటించింది. వారానికి ఐదు రోజుల పని, కొత్త రిక్రూట్​మెంట్​ప్రారంభించడం వంటి అంశాలపై ఐబీఐ దగ్గర ప్రస్తావించామని, ఫలితం కనిపించలేదని నేషనల్​ కాన్ఫిడరేషన్​ఆఫ్​బ్యాంక్​ ఎంప్లాయీస్​(ఎన్​సీబీఈ) జనరల్​సెక్రటరీ చంద్రశేఖర్​అన్నారు. 

తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో ఏర్పాటైన యూఎఫ్​బీయూ పబ్లిక్ ​సెక్టార్​ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నదని చెప్పారు. ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్​ రివ్యూలు, పెర్ఫార్మెన్స్​ఇన్సెంటివ్స్​ను ఇవ్వడాన్ని నిలిపివేయాలని డిమాండ్​చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగ భద్రత ఉండదని చంద్రశేఖర్​ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎఫ్​బీయూలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్  వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు ఉన్నాయి.