అమర ప్రేమికుడు అంటే ఇలాగే ఉంటాడేమో మరి.. బ్యాంక్ లో జాబ్ చేస్తూ దొంగతనాలు చేసి మరీ తన లవర్ కు కాస్ట్లీ గిఫ్ట్ లు ఇస్తున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ కు లగ్జరీ వస్తువులు, ఫైవ్ స్టార్ హోటళ్లో డిన్నర్ చేయించడానికి దొంగతనాలకు పాల్పడుతూ ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. గురువారం అతన్ని మాంబలం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంసీఏ చదివిన కుమార్ చెన్నైలోని ఓ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు. కుమార్ కు వచ్చే రూ.30వేల సాలరీ తన అవసరాలకు చాలక దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల ముందు ఓప్పుకున్నాడు. కొట్టేసిన డబ్బులతో కుమార్ తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్టులు ఇచ్చానని పోలీసుల విచారణలో చెప్పాడు.
టి నగర్‌లోని శరవణ ఎలైట్ స్టోర్స్‌లో గోల్డ్ రింగ్ కొట్టేశాడు. ఉస్మాన్ రోడ్‌లోని శరవణ ఎలైట్ స్టోర్స్‌లోని మరో చోరీ చేశాడు. షాప్ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పలు షాపుల్లో హడావిడీ ఎక్కువగా ఉన్న టైంలో కుమార్ చోరీలకు పాల్పడేవాడు. క్రోమ్‌పేట, పల్లవరం, టి నగర్ వంటి వివిధ ప్రాంతాల్లో చాలా దుఖాణాల్లో చోరీలు చేశాడు. అంతే కాదు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి తన ఫోన్ లోన్ యాప్స్ లో డబ్బులు తీసుకొని వాటిని కూడా తిరిగి చెల్లించలేదట. శుక్రవారం కుమార్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.