
హైదరాబాద్: ఆల్ ఇండియా బ్యాంకు యూనియన్స్ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. మార్చి 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు సమ్మె చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ నిర్ణయం తీసుకుంది. 9 జాతీయ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె జరగనుంది. పలు కీలక డిమాండ్లతో ఈ సమ్మెకు బ్యాంకు యూనియన్స్ పిలుపునిచ్చాయి.
బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి అన్ని విభాగాలలో నియామకాలు చేపట్టాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బ్యాంకు యూనియన్స్ డిమాండ్ చేశాయి. ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలనే డిమాండ్ను మరోమారు తెరపైకి తీసుకొచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2013 నుంచి 2024 వరకు లక్షా 39 వేల ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని ఆల్ ఇండియా బ్యాంకు యూనియన్స్ ఆవేదన వ్యక్తం చేశాయి.
బ్యాంకు యూనియన్స్ డిమాండ్లు, చెప్తున్నదేంటంటే..
* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెర్ఫార్మన్స్ రివ్యూ.. PLI మార్గదర్శకాలను వెనక్కు తీసుకోవాలి
* ప్రభుత్వ రంగం బ్యాంకులను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం
* కేంద్ర ప్రభుత్వం.. యాజమాన్యాలు స్పందించి డిమాండ్లను పరిష్కరించాలి
* లేనిపక్షంలో భవిష్యత్ లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తాం
* గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.. ఇప్పుడు వెనక్కు తగ్గింది
* తప్పని పరిస్థితులలో మేము సమ్మెకు వెళ్తున్నాం