మనం నిత్యం అనేక పనుల మీద బ్యాంకులకు వెళ్తుంటాం..బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్నా..ఏవైనా లోన్ల సమాచారం, కొత్తగా వడ్డీరేట్లు, బ్యాంకింగ్ రూల్స్ ఇలా అనేక పనులపై బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.. అలాంటి సమయంలో బ్యాంకులకు ఏయే నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయి.. సెలవులు ఉంటే ఏతేదీల్లో ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటి ప్రకారం మన షెడ్యూల్ ను నిర్ణయించుకోవచ్చు.. అయితే ప్రస్తుతం జూలై నెల ప్రారంభం అయింది గనక.. హైదరాబాద్ నగరంలో జూలై నెలలో బ్యాంకులకు ఎప్పుడెపుడు సెలవులున్నాయి.. అవి ఏయే తేదీల్లో ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని బ్యాంకులకు జూలై2024 నెలలో మొత్తం ఏడు సెలవులున్నాయి. ఆర్బీఐ ప్రకారం.. జూలైలో ఆరు బ్యాంకు సెలవులున్నాయి. ఒక సెలవును మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టం ప్రకటించింది.జూలై 17న ఈ సెలవు దినం ఉంటుంది.
జూలై 17 న మొహర్రంతో పాటు 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం 13, 27 తేదీల్లో బ్యాంకులు మూతబడనున్నాయి.
హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవైటు రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు మొత్తం పైన తెలిపిన తేదీల్లో మూతపడనున్నాయి.