బ్యాంకుల పనితీరు భేష్​.. ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడి

బ్యాంకుల పనితీరు భేష్​.. ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడి
  • హెచ్​1లో  వ్యాపారం 11 శాతం వృద్ధి 
  •  ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లో (హెచ్​1) ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్​బీలు)  బలమైన పనితీరును కనబరిచాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నికర లాభంలో 11 శాతం వృద్ధి ఉందని, నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏలు) తగ్గాయని పేర్కొంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌తో సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్​బీ) మొత్తం వ్యాపారం ఏప్రిల్–-సెప్టెంబర్ కాలంలో రూ. 236.04 లక్షల కోట్లుగా ఉంది. వార్షికంగా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది.  క్రెడిట్,  డిపాజిట్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో వరుసగా 12.9 శాతం,  9.5 శాతం వార్షిక వృద్ధి చెందాయి. వీటి విలువ  వరుసగా రూ. 102.29 లక్షల కోట్లు  రూ. 133.75 లక్షల కోట్లుగా ఉంది.  ఈ కాలంలో నిర్వహణ  నికర లాభం రూ. 1,50,023 కోట్లు (14.4 శాతం వార్షిక వృద్ధి)  రూ. 85,520 కోట్లు (25.6 శాతం వార్షిక వృద్ధి) ఉంది.  సెప్టెంబర్ 2024లో స్థూల,  నికర ఎన్​పీఏలు వరుసగా 3.12 శాతం  0.63 శాతానికి తగ్గాయి.