Toll Tax: హైవేలపై టోల్ ట్యాక్స్.. ఇకపై బ్యాంకులు వసూలు చేస్తాయి

Toll Tax: హైవేలపై టోల్ ట్యాక్స్.. ఇకపై బ్యాంకులు వసూలు చేస్తాయి

ఇప్పటివరకు మనం హైవేలపై వెళ్తున్నపుడు టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నాం కదా.. ఇకపై దేశ వ్యాప్తంగా  హైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలపై వెళ్తున్నప్పడు ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగి ఫాస్టాగ్ చూపించి వెళ్లాల్సిన పనిలేదు.. అసలు టోల్ టాక్స్ వసూలు చేసేందుకు ఫిజికల్ టోల్ ప్లాజాలే ఉండవు..టోల్ టాక్స్ వసూలు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రకం విధానాన్ని అమలులోకి తేనుంది.. ఇందుకు గాను బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. బిడ్స్ కూడా వేస్తోంది. పూర్తి వివరాల్లో కి వెళితే.. 

హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలపై ఇకపై టోల్ గేట్లు, ఫాస్టాగ్ చెల్లింపులు ఉండవు.. ఇకపై బ్యాంకులే టోల్ ట్యాక్స్ ను వసూలు చేయనున్నాయి. ఇందుకోసం దేశ వ్యాప్తంగా మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(MLFF)  కొత్త రకం టోల్ సిస్టమ్ అమలలోకి రానుంది. 

Also Read : అమెరికా, ఇండియాల మధ్య టైం డిఫరెన్స్ ఇదే

మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(MLFF) అంటే.. 

మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(MLFF)  విధానంలో ఫిజికల్ టోల్ బూతులు ఉండవు. వీటికి బదులుగా గ్రాంట్రీస్ ముందు సెన్సార్ అండ్ ఎక్విప్ మెంట్ ఇన్ స్టాల్డ్ సిస్టమ్ ఉంటుంది.ఈ విధానం ద్వారా వాహనాలు సమాచారం తీసుకొని ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ కు మేసేజ్ ఇస్తుంది. దీని ద్వారా బ్యాంకు ఖాతాను ఆటోమేటిక్ గా ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. 

మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(MLFF) సిస్టమ్ మొదట ఎక్కడ మొదలవుతుందంటే.. 

ఢిల్లీ నుంచి హర్యానా , గుర్గావ్ మధ్య ఏర్పాటు చేసిన ద్వారకా ఎక్స్ ప్రెస్ వే పై ఈ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(MLFF) సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకులలో సంప్రదింపులు జరిపిన తర్వాత అమలులోకి రానుంది. బిడ్స్ కూడా వేస్తున్నట్లు సమాచారం. మరో మూడు నెలల్లో ఈ విధానం అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. 

బ్యాంకులు టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తాయి?

రద్దీ,  కాలుష్యాన్ని తగ్గించడానికి , ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేయడానికి MLFF విధానం కింద మరిన్ని కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు NHAI తెలిపింది. బ్యాంకులు ఆర్‌బీఐ పర్యవేక్షణలో ఉన్నందున, టోల్ వసూలులో మరింత పారదర్శకత, ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా NHAI పేర్కొంది.

MLFF టోల్ టాక్స్ సిస్టమ్ ఇది ఎలా పని చేస్తుందంటే.. 

ఈ కొత్త వ్యవస్థతో NHAI మరిన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను MLFF వ్యవస్థ కిందకు తీసుకురావాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంతరాలు లేని, లేటెస్ట్ టోల్ చెల్లించేందు ఈజీ అవుతుంది. 

ఈ సిస్టమ్ చెల్లని లేదా తప్పిపోయిన ట్యాగ్‌లతో నడిచే వెహికల్స్ గుర్తిస్తుంది.

చెల్లించని వాహనాలు ఫ్లాగ్ చేయబడతాయి. వాటి వివరాలు సెంట్రల్ రిజిస్ట్రీ వెహికల్ డేటాబేస్‌తో భాగస్వామ్యం చేయబడతాయి.

NOC లేదా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడానికి ఈ బకాయిలను క్లియర్ చేయడం అవసరం.