కొత్త సంవత్సరం రావడమే కాదు 2025లో జనవరి నెల కూడా మరో 4 రోజుల్లో గతంగా మిగిలిపోనుంది. నెల మారుతుందంటే చాలా మారుతుంటాయి. అందులో మరీ ముఖ్యమైనవి బ్యాంకులకు సెలవులు. 2025, ఫిబ్రవరి నెలలో తెలంగాణ అంతటా బ్యాంకులు ఏడు రోజులు బంద్ కానున్నాయి. వాటిల్లో నాలుగు ఆదివారాలు కాగా, రెండో శనివారం, నాలుగో శనివారం, మహాశివరాత్రి పర్వదినం ఉన్నాయి. ఫిబ్రవరి 2025లో ఏయే తేదీల్లో తెలంగాణలో బ్యాంకులు సెలవులు కారణంగా మూతపడనున్నాయో తేదీలతో సహా..
* ఫిబ్రవరి 2, 9, 16, 23: ఆదివారాలు
* ఫిబ్రవరి 8, 22: రెండో శనివారం, నాలుగో శనివారం
* ఫిబ్రవరి 26: మహాశివరాత్రి
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు బ్యాంకు సెలవుల గురించి ముందస్తు సమాచారంతో ఉండటం వల్ల కస్టమర్లు బ్యాంకులకు వెళ్లి నిరాశతో వెనుదిరగాల్సిన అవసరం ఉండదు.
ALSO READ | రైతన్నలకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ