పదేండ్లలో రైటాఫ్‌‌‌‌ అయిన బ్యాంక్ లోన్లు రూ.16.35 లక్షల కోట్లు: లోక్‌‌‌‌సభలో నిర్మలా సీతారామన్‌‌‌‌

పదేండ్లలో రైటాఫ్‌‌‌‌ అయిన బ్యాంక్ లోన్లు రూ.16.35 లక్షల కోట్లు: లోక్‌‌‌‌సభలో నిర్మలా సీతారామన్‌‌‌‌
  • రికవరీ ప్రాసెస్‌‌‌‌ కొనసాగుతుంది 

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులు గత పది ఆర్థిక సంవత్సరాల్లో రూ.16.35 లక్షల కోట్ల మొండిబాకీల (నాన్‌‌‌‌ పెర్ఫార్మింగ్ అసెట్స్‌‌‌‌–ఎన్‌‌‌‌పీఏల) ను  రైటాఫ్ (బుక్స్‌‌‌‌ నుంచి తొలగించడం) చేశాయి.  2018–19 ఆర్థిక సంవత్సరంలో  ఎక్కువగా రూ.2,36,265 కోట్లను రైటాఫ్ చేశాయని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లోక్​సభలో తెలిపారు.  2014–15 లో రూ.58,786 కోట్లు, 2023–24 లో రూ.1,70,270 కోట్లు రైటాఫ్ చేశాయని వివరించారు. రైటాఫ్ చేసినా,  అప్పుల రికవరీ ప్రాసెస్‌‌‌‌ కొనసాగుతుందని, బారోవర్లకు ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. 

కాగా, బ్యాంకులు కోర్టులకు, డెట్‌‌‌‌ రికవరీ ట్రిబ్యునల్స్‌‌‌‌కు వెళ్లడం వంటి వివిధ మార్గాల్లో  అప్పులను రికవర్ చేస్తాయి. లోన్‌‌‌‌కు సంబంధించి  ఫోన్ కాల్స్‌‌‌‌, మెసేజ్‌‌‌‌లు చేస్తాయి. ఎన్‌‌‌‌పీఏ అమౌంట్ ఎక్కువగా ఉంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌ కూడా వెళతాయి.   వరుసగా నాలుగేళ్ల పాటు ప్రొవిజినింగ్‌‌‌‌ చేసిన మొండి బాకీలు కూడా రైటాఫ్ చేసిన  ఎన్‌‌‌‌పీఏల్లో ఉన్నాయి. 

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ డేటా ప్రకారం, కిందటేడాది డిసెంబర్ 31 నాటికి,  షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 29 కంపెనీలకు ఇచ్చిన లోన్లు  ఎన్‌‌‌‌పీఏలుగా  మారాయి. వీటి  బకాయిలు రూ. వెయ్యి కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం బకాయిల విలువ రూ.61,027  కోట్లుగా ఉంది.