వేలంలో 5.5 మిలియన్​ డాలర్లు పలికిన పెయింటింగ్

వేలంలో 5.5 మిలియన్​ డాలర్లు పలికిన పెయింటింగ్

లండన్: ఫేమస్ ​ఆర్టిస్ట్​ జాక్ వెట్రియానో గీసిన "ది సింగింగ్ బట్లర్" ను స్ఫూర్తిగా ఓ స్ట్రీట్ ​ఆర్టిస్ట్ బ్యాంక్సీ​గీసిన అరుదైన పెయింటింగ్ లండన్‌‌లో జరిగిన వేలంలో దాదాపు 4.3 మిలియన్ పౌండ్లకు (5.5 మిలియన్​ డాలరకు) అమ్ముడు పోయింది. 73 ఏండ్ల స్కాటిష్ ఆర్టిస్ వెట్రియానో మరణించిన ఒక రోజు తర్వాత బ్యాంక్సీ "క్రూడ్ ఆయిల్ (వెట్రియానో)" పెయింటింగ్​అమ్ముడు పోయింది. 

వెట్రియానో "సింగింగ్ బట్లర్"పేరుతో.. సాయంత్రం గాలివానలు వీచే బీచ్‌‌లో నృత్యం చేస్తున్న జంటను బట్లర్, పనిమనిషితో కలిసి గొడుగులు పట్టుకుని ఉన్నట్టు చిత్రీకరించారు. ఇది 2004లో వేలంలో 744,800 పౌండ్లకు అమ్ముడై స్కాటిష్ లో రికార్డును సృష్టించింది. ప్రస్తుతం బ్యాంక్సీ.. మునిగిపోతున్న ఆయిల్ లైనర్, హజ్మత్ సూట్‌‌లలో ఇద్దరు వ్యక్తులు విషపూరిత వ్యర్థాల బ్యారెల్‌‌ను బీచ్‌‌లోకి తీసుకువెళుతున్న దృశ్యాన్ని తిరిగి రూపొందించాడు.