హైదరాబాద్‌లో రూ.20 లక్షల ఫారిన్​ సిగరెట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో రూ.20 లక్షల ఫారిన్​ సిగరెట్లు స్వాధీనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిషేధిత ఫారిన్ సిగరెట్లు స్టోర్ చేసిన గోదాంపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్ టీమ్ హబీబ్ నగర్ పోలీసులు  దాడి చేశారు.  రూ. 20 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్టు  టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అందె శ్రీనివాస రావు తెలిపారు.  ఆగాపూరాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్, హబీబ్ నగర్ కు చెందిన మహ్మద్ అయూబ్ అనే ఆటో డ్రైవర్ ను అరెస్టు చేసి, నిషేధిత విదేశీ సిగరెట్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.11 గన్నీ బ్యాగుల్లో గోల్డ్ స్టాగ్ 39,500 ప్యాకెట్లు, 3 గన్నీ బ్యాగుల్లో 4,500 ప్యాకెట్లు, ఒక గన్నీ బ్యాగ్ లో 1000 ప్యాకెట్ల సిగరెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.20.5లక్షలు ఉంటుందని తెలిపారు. 

మహ్మద్ ఇమ్రాన్ నిజామాబాద్ కు చెందినవాడు కాగా బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇతడికి అఘాపురాలో ఎస్.ఎన్.ట్రేడర్స్ పేరుతో పాన్ మసాలా బిజినెస్ నడుపుతూ ఉండేవాడు. కొన్నేళ్లుగా గుజరాత్, ఢిల్లీకి చెందిన రమేశ్​వద్ద నిషేధించిన విదేశీ సిగరెట్లను తక్కువ ధరకు కొని ఇక్కడ అమ్ముతున్నాడు. నిందితులపై పీఎస్ హబీబ్ నగర్ లో  కేసు నమోదు చేశారు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ ఎస్ .బాలస్వామి, పీఎస్ హబీబ్ నగర్ సీఐ టి.రాంబాబు, సౌత్ వెస్ట్ జోన్ ఎస్ఐ సాయికిరణ్ పాల్గొన్నారు.