బ్యాన్ చేసిన చైనా యాప్‎లు మళ్లీ భారత్‎లోకి ఎంట్రీ.. ఈ సారి మామూలు ప్లాన్ కాదుగా..!

బ్యాన్ చేసిన చైనా యాప్‎లు మళ్లీ భారత్‎లోకి ఎంట్రీ.. ఈ సారి మామూలు ప్లాన్ కాదుగా..!

న్యూఢిల్లీ: దేశ భద్రతా కారణాల దృష్ట్యా పొరుగు దేశం చైనాకు చెందిన వివిధ యాప్‎లపై భారత్ నిషేదం విధించిన విషయం తెలిసిందే. యువతను ఎంతో ఆకట్టుకున్న పబ్జీ, టిక్ టాక్ వంటి ప్రముఖ యాప్‎లను ఇండియాలో బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. భారత్ నిషేదం విధించిన చైనా యాప్‎లు కొన్ని మళ్లీ దేశంలోకి రీ ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు 36  యాప్‎లు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలో యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. భారత్ బ్యాన్ చేసిన చైనా యాప్‎లు సెలెంట్‎గా మళ్లీ ఇండియా మార్కెట్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఈ యాప్‎ల రీ ఎంట్రీకి కారణం భారత్, చైనా దేశాల మధ్య ఇటీవల దౌత్య సంబంధాలు మెరుగుపడటమేనని తెలుస్తోంది. 2020లో గాల్వన్ వ్యాలీ ఘర్షణతో భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని చైనాకు చెందిన పలు యాప్‎లను భారత్ నిషేదించింది. 

2020లో గాల్వన్ వ్యాలీ ఘర్షణ తర్వాత భారత ప్రభుత్వం యూసీ బ్రౌజర్, షీన్, టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై బ్యాన్ విధించింది. ఆ తరువాత 2022లో  పబ్జీ, గరెనా ఫ్రీ ఫైర్ వంటి యాప్‌లపైన కొరడా ఝులిపించింది. ఇలా మొత్తంగా దాదాపు 200 చైనీస్ యాప్‌లపై భారత్ నిషేదం విధించింది. ఇటీవల న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడటంతో ఈ యాప్‎లు తిరిగి భారత్‎ మార్కెట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read :- థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు

ప్రస్తుతం చైనాకు చెందిన 36 యాప్‎లు ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. అయితే.. భారత్‎లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చైనా యాప్‎లు కొన్ని భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో రాగా.. ఇంకొన్ని కొత్త పేర్లతో మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. ఎలాగంటే.. చైనాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షీన్.. రిలయన్స్‌తో కలిసి భారత మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 

భారత్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ చైనా యాప్‎లు

  • Xender – ఫైల్-షేరింగ్ యాప్
  • యూకు –  స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్
  • టావోబావో – ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్
  • టాంటన్ – చైనీస్ డేటింగ్ యాప్
  • మ్యాంగో టీవీ – వినోద యాప్