మణుగూరు, వెలుగు: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో వలసవాదుల పెత్తనం పెరిగిపోయిందని టీబీజీకేఎస్ మణుగూరు బ్రాంచ్ సెక్రటరీ బానోత్ కృష్ణ, కొండాపురం మైన్ సేఫ్టీ మెంబర్ అజీజ్ ఆరోపించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తాము కీలకంగా పనిచేశామని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయడంతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని స్థాపించిన నాటి నుంచి గౌరవ అధ్యక్షురాలు కవితతో కలిసి కోల్ మైన్స్ ఏరియాలో సంఘాన్ని బలోపేతం చేశామన్నారు.
కానీ సింగరేణిలో ఎన్నికల సమయంలో ఇతర సంఘాల నుంచి వలస వచ్చిన కొందరు లీడర్లు యూనియన్ ను వారి చేతుల్లోకి తీసుకొని కష్టించి పని చేసిన వారికి ప్రాధాన్యం లేకుండా చేశారని వాపోయారు. విలువ లేని చోట ఉండలేమని, తమతో పాటు మరికొందరు టీబీజీకేఎస్ కు రాజీనామా చేసి త్వరలో ఐఎన్టీయూసీలో చేరుతున్నట్లు ప్రకటించారు.