అన్నపురెడ్డిపల్లి, వెలుగు : ఓడినా, గెలిచినా ప్రజల మధ్యనే ఉంటానని, ఎవరూ అధైర్య పడొద్దని బీఆర్ఎస్ శ్రేణులతో వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ చెప్పారు. సోమవారం జూలురుపాడులో బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో యల్లంకీ సత్యనారాయణ, చావా వెంకట రామారావు, చిట్టిబాబు పాల్గొన్నారు.