ఖానాపూర్ బీఎస్పీ అభ్యర్థిగా బన్సీలాల్ రాథోడ్

ఖానాపూర్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఖానాపూర్ బీఎస్పీ అభ్యర్థిగా సీనియర్ లీడర్ బన్సీలాల్ రాథోడ్ ను పార్టీ జాతీయ కోఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మున్యాల్ కు చెందిన బన్సీరాల్ రాథోడ్ కొన్నేండ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా బన్సీలాల్ రాథోడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి, ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.