కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమన్నది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోటా పోటీగా సమావేశాలు నిర్వహిస్తూ..బలప్రదర్శన చేసుకుంటున్నారు.
బీర్కూర్లో బాన్సువాడ ఇంచార్జ్ కాసుల బలరాజ్ నేతృత్వంలో నియోజక వర్గ పార్టీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. అటు బాన్సువాడలో పీసీసీ డేలిగేట్ రాజిరెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడలో సోనియా గాంధీ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు జనాన్ని సమీకరించడం కోసం కాసుల బలరాజ్ , పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ వర్గాలు పోటా పోటీగా సమావేశం నిర్వహించారు.