బాన్సువాడలో గెలుపు నాదే : కాసుల బాలరాజు

బాన్సువాడ, వెలుగు :  గత ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడానని, ఈ సారి గెలుపు తనదేనని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి కాసుల బాలరాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన నామినేషన్ వేసి విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించినా, కొందరు నమ్మకద్రోహుల కారణంగా ఓడిపోయానన్నారు. గత ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గ ప్రజల అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేశానన్నారు. అధికార పార్టీ లీడర్లు అనేక దౌర్జన్యాలు చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో దోపిడి చేస్తున్నారన్నారు. అంబేద్కర్​ చౌరస్తా వద్ద మన ఇద్దరి ఆస్తుల లెక్క తేలుద్దామని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డికి సవాల్​ విసిరారు. బాన్సువాడలో బీఆర్​ఎస్​ కార్యకర్తలకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారని విమర్శించారు. ప్రజల కడుపులో తలపెట్టి ఓట్లు అడుగుతానన్నారు. ఆయన వెంట నార్ల రఘు, కాలిక్, లాయర్ రమాకాంత్, హన్మండ్లు సాయిలు ఉన్నారు.