
- బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు
బీర్కూర్, వెలుగు : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం బీర్కూర్ మండలంలోని హైస్కూల్లో నిర్వహించిన యాన్యువల్డేకు ఎంఈవో హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు మారుమూల గ్రామం నుంచి వచ్చిన వారేనని తెలిపారు.
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా అడుగులు వేయాలని సచించారు. ఈనెల 21 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీచర్లు కాకయ్య, రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మేకల విఠల్, మండల మాజీ అధ్యక్షుడు రఘు, మాజీ సర్పంచ్ గంగారం, విద్యార్థులు పాల్గొన్నారు.