దళారులను నమ్మి మోసపోవద్దు : పోచారం శ్రీనివాస్​ రెడ్డి

దళారులను నమ్మి మోసపోవద్దు : పోచారం శ్రీనివాస్​ రెడ్డి
  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి

బీర్కూర్, వెలుగు : ధాన్యాన్ని దళారులకు ఇచ్చి మోసపోవద్దని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నస్రుల్లాబాద్​ మండలం మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్​ గ్రామం,  బీర్కూర్​ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు.   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు.  ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లు క్వింటాలుకు రూ.5 వందల బోనస్​ చెల్లిస్తున్నామన్నారు.  కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్​ కాసుల బాల్​రాజ్​, బాన్సువాడ సబ్​ కలెక్టర్ కిరణ్మయి, మార్కెట్​ కమిటీ చైర్మన్​ దుర్గం శ్యామల, మాజీ సొసైటీ చైర్మన్​ పెర్క శ్రీనివాస్, లీడర్లు శశికాంత్, అవారి గంగారాం తదితరులు పాల్గొన్నారు. 

ఐక్యతకు మారుపేరు రంజాన్  

కోటగిరి, వెలుగు : హిందూ ముస్లింల ఐక్యతకు మారుపేరు రంజాన్ పండుగ అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి కోటగిరి మండలాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తహసీల్దార్ గంగాధర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పోచారం పండ్లు తినిపించి  దీక్షను విరమింప చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ కోటగిరి, పోతంగల్ మండలాధ్యక్షులు షాహిద్ హుస్సేన్, పుప్పాల శంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కులకర్ణి అనిల్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, కోటగిరి సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్, ఇన్​చార్జి ఎంపీడీవో చందర్ నాయక్, ఎస్సై సందీప్, కాంగ్రెస్​ శ్రేణులు పాల్గొన్నారు.

​సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలి

నిజామాబాద్, వెలుగు : వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్​బీ గెస్ట్​ హౌస్​లో రెవెన్యూ, ఫారెస్ట్​, ఇరిగేషన్, ల్యాండ్​ సర్వే ఆఫీసర్లతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. గిరిజన తండాల్లో సాగు, తాగునీరు అందించేందుకు రిజర్వాయిర్​ నిర్మిస్తున్నామన్నారు.  జాకోరా, చందూర్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​లకు డెలివరీ చాంబర్​ల నిర్మాణానికి కావాల్సిన ల్యాండ్​ను కేటాయించాలని అధికారులను కోరారు.

ల్యాండ్ కేటాయిస్తాం : కలెక్టర్​

సిద్దాపూర్ రిజర్వాయిర్ నిర్మాణానికి 280 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించామని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. ఇంకా అవసరముంటే భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సబ్​ స్టేషన్​ నిర్మాణానికి పర్మిషన్లు తీసుకోవాలని, పనులన్నీ ఏకకాలంలో కొనసాగేలా ప్లాన్​ రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు.  డీఎఫ్​వో వికాస్​మీనా, బోధన్ సబ్ కలెక్టర్​ వికాస్ మహతో, కామారెడ్డి ఇరిగేషన్ శాఖ సీఈ శ్రీనివాస్, ఎఫ్​డీవో భవానీ శంకర్, తహసీల్దార్లు ఉన్నారు.