పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్​ కలెక్టర్​

పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్​ కలెక్టర్​

నస్రుల్లాబాద్​, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి మండల కేంద్రంలోని పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్​ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్యను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్​కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  

మహమ్మద్ నగర్ స్కూల్ తనిఖీ  

మహమ్మద్ నగర్ (ఎల్లారెడ్డి ), వెలుగు :  మండల కేంద్రంలోని గవర్నమెంట్ స్కూల్ ను బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం తనిఖీ చేశారు. స్కూల్​లోని సమస్యలపై పదో విద్యార్థులను ఆరా తీశారు.  అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సబ్​ కలెక్టర్​ వెంట తహసీల్దార్ సవాయ్ సింగ్, స్కూల్ హెచ్ఎం మధుసూదన్ ఉన్నారు.